Srivalli – Pushpa Lyrics
Share

Movie Name : Pushpa – 2021
Song Name : Srivalli
Music : Devi Sri Prasad
Singer: Sid Sriram
Lyricist : Chandrabose
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ
ముందుండే నేను
మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ
తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు
తలనే వంచాను
ఇంతబతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ళ దుద్దులు పెడితే
ఎవతైనా అందగత్తె అయినా
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే

Follow Us