Kochem Ishtam Song Lyrics
Share
Movie Name : Konchem Ishtam Konchem Kashtam (2009)
Song Name : Kochem Ishtam – Song Lyrics
Singer : Shankar Mahadevan
Lyrics : Sirivennela Seetharama Sastry
Music : Shankar-Ehsaan-Loy
Kochem Ishtam – Song Lyrics
Bhaja Bhajare Premika Pattuko Cheli Paadam
Baapure Balika Teeyake Na Praanam
Anukunte Sara Okate Oodhara
Chepthe Vinadha Vurike Thondara
Konchem Istam Vunte Konchem Kastam Ante
Oppukoka Tappadantu Taguve Taguna
Entho Istam Vunna Entho Kastam Anna
Gotitho Kondethamante Sarele Anana
Anaganaga Jaliga Sagani Mana Gadha
Enthaki Teladha Emiti Yama Badha
Prathi Sari Ila Modalaithe Yela
Sudilo Padavai Kadaderedhela
Konchem Istam Vunte Konchem Kastam Aina
Kanchi Daka Cherchaleda Ninnu Na Venaka
Entha Istam Vunte Antha Kastam Vunde
Aadhi Lone Hamsa Paadam Avvake Chilaka
Yennadu Cherame Thinnaga Thudi Teeram
Aape Aapada Kadhe Pupodha
Bedurendukata Nenu Vunnakada
Konchem Istam Venta Konchem Kastam Venta
Premadesam Cheralsinde Anduko Sujana
Entho Dooram Vunna Entha Kalam Aina
Prema Kosam Parugulu Teeddam Padave Lalana
Rajune Baanisa Cheyada Cheli Bandham
Samayam Tho Sada Samaram Cheyaga
Valache Hrudayam Geliche Teerada
Konchem Istam Pudithe Konchem Kastam Pedithe
Anthu Chuse Pontham Avada Ponde Aasa
Kore Majili Laga Pore Ghajini Laga
Otamante Kota Chere Bata Nuvvu Poda
Mathi Chedithe Bhama Ro Manadikadika Lokam
Munigithe Prema Lo Telaniyadu Maikam
Medalo Ee Uri Paduthunda Mari
Idhi Pudande Anada Oopiri
Konchem Istam Vunna Konchem Kastam Aina
Tene Patte Reputhundi Ee Allari
Inthaku Munde Vunna Endari History Vinna
Nuvvu Nene Eve And Adam Ante Sari
=============
భజభజరా ప్రేమికా పట్టుకో చెలి పాదం
బాపురే బాలికా…తీయకే నా ప్రాణం
అనుకుంటే సరా..ఒకటే ఊదరా
చెబితే వినదా ఉరికే తొందర
కొంచెం ఇష్టం ఉంటే…కొంచెం కష్టం అంటే
ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా
ఎంతో ఇష్టం ఉన్నా…ఎంతో కష్టం ఉన్నా
పూటకో కొండెత్తమంటే సరే అననా…
అనగనగా జాలిగా సాగెనీ మన గాథ
ఎంతకీ తేలదా…ఏమిటీ యమ బాధ
ప్రతి సారి ఇలా మొదలైతే ఎలా
సుడిలో పడవై కడ తేరేదెలా
కొంచెం ఇష్టం ఉంటే…కొంచెం కష్టం అయినా
కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక..
ఎంత ఇష్టం ఉంటే…అంత కష్టం ఉందే
ఆగిపోని హంస పాదం ఆపకే చిలకా
ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం
ఆపే ఆపదా కాదే పూపొద
బెదురెందుకట నేనున్నా కదా…
కొంచెం ఇష్టం వెంట…కొంచెం కష్టం వెంట
ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సజనా
ఎంతో దూరం ఉన్నా…ఎంత కాలం అయినా
ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా
రాజునే బానిసా…చెయ్యదా చెలి బంధం
సమయంతో సదా…సమరం చేయదా
వలచే హృదయం…గెలిచే తీరదా
కొంచెం ఇష్టం పుడితే…కొంచెం కష్టం నెడితే
అంతు చూసే పంతం అవదా పొంగే ఆశ
కోరే మజిలీ దాకా పోరే గజనీ లాగా
ఓటమంటే కోట చేరే బాటనుకోరా
మతి చెడితే భామరో మనది కాదిక లోకం
మునిగితే ప్రేమలో తేలనీయదు మైకం
మెడలో ఈ ఉరి…పడుతున్నా మరి…
ఇది పూదండే అనదా ఊపిరి
కొంచెం ఇష్టం ఉన్నా..కొంచెం కష్టం అయినా
తేనెపట్టై రేపుతుంది ఈ అల్లరి
ఇంతకు ముందే ఉన్న ఎందరి హిస్టరి విన్నా
నువ్వు నేనే ఈవ్ అండ్ ఆడం అంతే
Follow Us