Kannula Logililo Song Lyrics
Share
Movie Name : Raja (1999)
Song Name : Kannula Logililo – Song Lyrics
Singer(s) : Unni Krishnan, Chitra
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : S.A. Raj Kumar
Kannula Logililo – Song Lyrics
Kannula Logililo Vennela Virisindi
Challani Jaabilitho Sneham Kudirindi
Chelimi Thodunte Chaalamma Lenidi Emundi
Aasa Chitikesthe Chaalamma Andanidemundi
Kannula Logililo Vennela Virisindi
Challani Jaabilitho Sneham Kudirindi
Gunnamaavi Gonthulo Thene Theepi Nimputhu Koyilamma Cherukunnadi
Endamaavi Daarilo Panchadaara Vaagula Kotha Paata Saaguthunnadi
Vontaraina Gundello Aanandala Andhelatho Aade Sandadidi
Allibilli Kaanthulatho Yekaanthala Cheekatini Tharime Bandhamidi
Kalatheragani Kalalanu Choodu Kantiki Kaavali Nenuta
Kalatharagani Velugulu Nedu Intiki Thoranamanukunta
Kannula Logililo Vennela Virisindi
Challani Jaabilitho Sneham Kudirindi
Panchukunna Oosulu Penchukunna Aasalu Thulli Thulli Aaduthunnavi
Kanche Leni Oohale Pancha Vanne Guvvalai Ningi Anchu Thaakuthunnavi
Kottha Jallu Kurisindi Brathuke Chiguru Thodigela Varamai Ee Vela
Vaanavillu Virisindi Minnu Mannu Kalisela Egase Ee Vela
Anuvanuvunu Thadipina Ee Thadi Amruthavarshini Anukona
Adugaduguna Pachani Baatanu Parichina Vanamunu Choosthunna
Kannula Logililo Vennela Virisindi
Challani Jaabilitho Sneham Kudirindi
Chelimi Thodunte Chaalamma Lenidi Emundi
Aasa Chitikesthe Chaalamma Andanidemundi
================
కన్నుల లోగిలిలో - పాట సాహిత్యం
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
గున్నమావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార వాగుల కొత్త పాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతల చీకటిని తరిమే బంధమిది
కలతేరగని కళలను చూడు కంటికి కావలి నేనుంటా
కలతరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి
కంచె లేని ఊహలే పంచ వన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్త జల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈ వేళా
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈ వేళా
అణువణువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకొన్నా
అడుగడుగునా పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్న
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది
Follow Us