Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Edhigo Rayalaseemagadda Song Lyrics

Share

Movie Name: Seetaiah (2003)
Song Name : Edhigo Rayalaseemagadda – Song Lyrics
Singer(S) : S. P. Balasubrahmanyam
Lyrics : C. Narayana Reddy
Music : M.M. Keeravani

Edhigo Rayalaseemagadda – Song Lyrics

Idigo Rayalasima Gadda… Dini Kadha Telusuko Telugu Bidda ||3||
I Gaddalo Pagalu Segaloddura… I Mattilo Netturolakoddura ||Idigo||
Ca: Patita Pavanudu Tirupati Vemkatesvarudu…
Sarva Rakshakudu Srisaila Mallesvarudu…
Koluvunnadi Simalone
Ramkelidu Lepakshi Basavanna Silpam…
Ranaberi Ninadimcu Camdragiri Durgam….
Nelakonnadi Nelalone…
Ca: Haruni Kamtike Kannarpimcina Kannappa Baktavarudu
Vijaya Nagara Samrajya Duramdhara Krushnaraya Buvidhudu
Caritra Kekkina Dharani Idi….
Padalane Svarapadhala Nadipina Annamayya Krutulu
Iha Parala Kalipina Virabrahmemdra Tatvagatulu
Alalai Pomgina Avani Idi…||2|| Amduke… ||I Gaddalo || ||Idigo||
Ca: Telladorala Hadalettimcina Uyyala Vada Narasimhareddi
Ko: Vamdemataram
Madama Tippaka Svarajya Samgramam Nadipina Kadapa Kotareddi….
Ko: Vamdemataram
Gadicerla Kalluri… Sadasivam Pappuri
Hampanna…Limganna.. Shekpir Rabiyabi
Okkara… Iddara … Padugura…A Nurgura…
Emdaremdaro Tyagamortulaku Janmamiccina Janani Yidi… ||Idigo||
Amtati Ciramtana Niramtara Vikasvara Vaibavamto Virajillina
Rayalasima … Mana Raitannala Sima…Inadu Dushkara Mushkara
Saktula Duramtalato Atalakutalamavutumte
Custu Umtara… Custune Umtara…Ko: Ledu…Ledu….
Ayite… Yuvata Vikramimcali… Navata Viplavimcali…
Nagomtuna Garjimce Nadame Mahadyamamai
Kullina I Vyavasdake Kottanetturekkimcali
Sarikotta Carita Srushtimcali…..||2||

===============

ఇదిగో రాయలసీమ గడ్డ… దీని కధ తెలుసుకో తెలుగు బిడ్డ ||౩||
ఈ గడ్డలో పగలు సెగలొద్దురా… ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా ||ఇదిగొ||
చ: పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు…
సర్వ రక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు…
కొలువున్నదీ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం…
రణభేరి నినదించు చంద్రగిరి దుర్గం….
నెలకొన్నాదీ నేలలోనే…
చ: హరుని కంటికే కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడూ
విజయ నగర సామ్రాజ్య దురంధర కృష్ణరాయ భూవిధుడు
చరిత్ర కెక్కిన ధరణి ఇది….
పదాలనే స్వరపధాల నడిపిన అన్నమయ్య కృతులు
ఇహ పరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర తత్వగతులు
అలలై పొంగిన అవని ఇది…||౨|| అందుకే… ||ఈ గడ్డలో || ||ఇదిగొ||
చ: తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి
కో: వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటరెడ్డి….
కో: వందేమాతరం
గాడిచెర్ల కల్లూరి… సదాశివం పప్పూరి
హంపణ్ణ…లింగణ్ణ.. షేక్పీర్ రబియాబి
ఒక్కరా… ఇద్దరా … పదుగురా…ఆ నూర్గురా…
ఎందరెందరో త్యాగమోర్తులకు జన్మమిచ్చిన జనని యిది… ||ఇదిగొ||
అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన
రాయలసీమ … మన రైతన్నల సీమ…ఈనాడు దుష్కర ముష్కర
శక్తుల దురంతాలతో అతలాకుతలమవుతుంటే
చూస్తూ ఉంటారా… చూస్తూనే ఉంటారా…కో: లేదు…లేదు….
అయితే… యువత విక్రమించాలి… నవత విప్లవించాలి…
నాగొంతున గర్జించే నాదమే మహాద్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్దకే కొత్తనెత్తురెక్కించాలి
సరికొత్త చరిత సృష్టించాలి…..||2||

Tags:
error: Content is protected !!